top of page

Vinod Mamidala 

Author of  Varanasi & Aame Books 

vinodm_edited.jpg
VIP01439_edited.jpg
  • Whatsapp
  • Facebook
  • Instagram
  • Linkedin

New

Varanasi

(2023)

As the sun rises over the sacred Ganges River, Varanasi reveals its mystical aura. The city's ghats come alive with devotees and pilgrims engaging in prayers and sacred rituals. From the ancient Dashashwamedh Ghat to the serene Assi Ghat, each step along the riverbank seems to wash away worldly worries, connecting me with the divine essence of this spiritual haven.

Order Now

vinodmamidalabooks

ఈ పుస్తకాన్ని కేవలం ఆయా ప్రదేశాల గురించి చెప్పడంతో సరిపుచ్చలేదు వినోద్. వారణాసి పర్యటించాలన్న ఆకాంక్షకు గల మూలాలతో మొదలు పెట్టి అనేక విషయాల్ని ప్రస్తావిస్తూ, ఆయా సందర్భాలలో తన ఆలోచనల పరంపరను, అనుభూతుల సాంద్రతను మనతో పంచుకుంటాడు. పాఠకుడితో ముచ్చట చెబుతున్నట్టుగా తన అనుభవాలని సృజిస్తాడు. ఈవిధమైన రచనా సంవిధానంలో అతను ఒక్కోసారి ఒక్కోవిధంగా దర్శనమిస్తాడు. ఒక పర్యాటకుడిగా, ఒక కథకుడిగా, నవలాకారుడిగా, యాత్రాచరిత్ర రచయితగా, పాత్రికేయునిగా, కుటుంబం పట్ల, మిత్రుల పట్ల ఆపేక్ష కలిగిన కొడుకుగా, అన్నగా, తమ్మునిగా, మిత్రునిగా కనిపిస్తాడు.

–ముందుమాటలో గుడిపాటి, ప్రముఖ సాహిత్య విమర్శకులు

Praise & Reviews

సాధారణ పాఠకులుసైతం ఆసక్తిగా తెలుసుకోదగ్గ విషయాలు అనేకం  ఈ పుస్తకంలో రచయిత పొందుపరిచారు. అక్కడి భక్తి ప్రవాహ తాదాత్మ్య ఆత్మానుభూతినీ తాను వదలలేదు. వినోద్ ఒక సహేతుక వాదిగా ఈ యాత్రా పుస్తకం ద్వారా పాఠకులకు పరిచయమవుతారు. 'వితండ నాస్తిక' అవలక్షణాలేవీ తాను ప్రదర్శించలేదు. ఈ పుస్తకం కేవలం భక్తిభావాలుగల పాఠకుల కోసమే అనుకొంటే పొరపాటు. ఈ దేశంలోని సామాన్య ప్రజలంతా విధిగా తెలుసుకోదగ్గ సుప్రసిద్ధ కాశీ పట్టణ వీధుల జీవనశైలి, గంగలో పారే పవిత్రత, అక్కడి మత సామరస్యత, ఆ మట్టి అణువణువులో నిక్షిప్తమైన గొప్పతనం, గాలిలో ప్రసరించే స్ఫూర్తి.. అన్నింటినీ మూటగట్టి వినోద్ చాలా సరళంగా అక్షరబద్ధం చేసి మనకందించారు. నావలె మీరంతా కూడా ఆలస్యం చేయకుండా ఆస్వాదించండి.

– దోర్బల బాలశేఖరశర్మ,  సీనియర్  జర్నలిస్టు, కవి, రచయిత

మనుషుల జీవితాలకూ ఈ బుక్ లో రచయిత చోటిచ్చాడు. రోడ్డుకు ఇరువైపులా ఫుట్​పాత్​ల  మీద, దుకాణాల పక్కన ప్రపంచాన్ని మరిచి నిద్రపోతున్న వాళ్ల గురించి, కాషాయ వస్త్రాలు ధరించి ముడతలు పడిన శరీరాలతో, అడ్డ నామాలతో, రుద్రాక్షలతో సంచరించే సాధువుల గురించీ, సారనాథ్​లో  తిరగాడే బౌద్ధ భిక్షువుల గురించి రాశాడు.  తాను ఎక్కిన బోటును నడిపిన తమిళియన్ రతన్ లాల్  గురించి,  సారాయ్ మోహన గ్రామంలో నౌరద్ అన్సారీ ద్వారా చేనేత కార్మికుల బతుకు చిత్రాలను కళ్ల గట్టాడు. ఇక మాన్ సింగ్ ప్యాలెస్ లో కలిసిన 'ఇషాని జైస్వాల్' కథకు కాస్తా ఎక్కువే చోటిచ్చాడు. కుటుంబ కట్టుబాట్లను, అడ్డంకులను అధిగమించి అనుకున్న  లక్ష్యం చేరిన ఈ యువతి కథ ఆలోచింపజేస్తుంది. పుస్తక ముగింపు తీరును బట్టి ఈ 'సోలో ట్రావెలర్' అసలు లక్ష్యమేమిటో మనకు బోధపడుతుంది.  

– మల్లేశం చిల్ల,

సీనియర్​ జర్నలిస్ట్​, రచయిత

vinodmamidala

About Vinod Mamidala 

Joutnalist & Author, 

bottom of page