6న ‘వారణాసి – యాత్ర’ ఆవిష్కరణ
- vinoo Sparkles
- Oct 2, 2023
- 1 min read
యువ జర్నలిస్టు వినోద్ మామిడాల రచించిన యాత్రాచరిత్ర ‘వారణాసి’ ఆవిష్కరణ సభ ఈ నెల 6న శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లోని రవీంద్రభారతి పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్‌లో నిర్వహించున్నారు. సభకు అయినంపూడి శ్రీలక్ష్మి అధ్యక్షతన నిర్వహించే ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత, ప్రముఖ కవి నిఖిలేశ్వర్ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. సభలో నవతెలంగాణ పూర్వ సంపాదకులు ఎస్. వీరయ్య, మామిడి హరికష్ణ, మెర్సీ మార్గరేట్, వేముల శ్రీనివాసులు, సత్యనారాయణ, పరాంకుశం వేణుగోపాల్, దోర్భల బాలశేఖర శర్మ, కోయ చంద్రమోహన్ ప్రసంగిస్తారు. ప్రచురణ : నవతెలంగాణ, 10.02.2023 https://navatelangana.com/literary-news-6/