నిండైన మనసుతో చేసిన కాశీ యాత్ర ఇది : నరేందర్, సీనియర్ జర్నలిస్ట్
- vinoo Sparkles
- Mar 6, 2024
- 1 min read
‘కాశీయాత్ర’ అంటే దేవుడిలో లీనమై, తన్మయత్వాన్ని పొందే అనుభూతి అనుకుంటాం. కానీ, తోటి జర్నలిస్టు, తమ్ముడు వినోద్మామిడాల రాసిన పుస్తకం చదివితే దానికి విభన్నమైన అనుభవం కలిగింది. ఆధ్యాత్మిక యాత్రలా కాకుండా సబ్జెక్టివ్ట్రావెలాగ్లా అనిపించింది. వినోద్ ఇందులో ఎక్కడా దేవుడిని నమ్మినట్టు కనిపించలేదు. అనవాయితీగా కాలభైరువుడిని మొక్కే భక్తుల బాటలో వినోద్ప్రయాణించలేదు. పవిత్ర భక్తుల వలె గంగనది స్నానాన్నీ చేయలేదు. కానీ, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానం, ఆహార అలవాట్లు, పూజల గు
రించి ముఖ్యంగా మణికర్ణికా ఘాట్ గురించి రాసిన తీరు కట్టిపడేసింది. అక్కడ పరిచయైన ఈషాని జీవిత గెలుపును మన ముందు ఉంచడంతో పాటు మాన్మహాల్ ఘాట్‌పై కూర్చుని తన ప్రేమను గుర్తు చేసుకోవడం బాగుంది. మార్కెట్‌లో పడగలెత్తిన కార్పొరేట్సామ్రాజ్యం కస్టమర్లను ఎలా దోపిడీ చేయగలతో చెప్పడం ఆలోచింపజేసింది. ఆస్తికవాద లక్షణాలేవి లేకుండా.. నిండైన మనసుతో చేసిన ఈ ‘కాశీయాత్ర’ను మీరూ ఒకసారి తిరిగేయండి..
ఇదిగో ఆమేజాన్ లింక్
–నరేందర్ జూకంటి
సీనియర్ జర్నలిస్ట్, +91 99893 82510