top of page
Search

పేజీలు తిప్పుతూ ఉంటే మా అమ్మ ను తీసుకుని కాశీ వెళ్లిన రోజు కళ్ళలో కనిపించింది: Sujatha Chebrolu

Updated: Feb 28, 2024

చక్కగా పుస్తకం రాసిన #vinodMamidala కు శుభాకాంక్షలు. జీవితం లో నాకేమీ గొప్ప టార్గెట్స్ ఏమి లేవు. నేను మా ఆయన ఇద్దరు పిల్లలు సుఖంగా ఉండాలని తప్ప. వినోద్ రాసిన బుక్ చేతులోకి తీసుకున్నపుడు ఆదీ చదువుదాం అనికూడా లేదు. యాత్రా కథనాలు పెద్దగా సరదా లేదు. కానీ పేజీలు తిప్పుతూ ఉంటే నేను ఎప్పుడో మా అమ్మ ను తీసుకుని కాశీ వెళ్లిన ఒక ఇష్టమైన రోజు కళ్ళలో కనిపించింది.. వినోద్ మాదిరిగా నేను ఒక్క విషయం కూడా గుర్తు పెట్టుకోలేదు.. అది మా అమ్మ సంతోషం.. ఆమె కోరిక..విశ్వనాథుని గుడికి సందుల్లోంచి నడిచి వెళ్ళటం.. మా అమ్మ కళ్ల నీళ్లతో శివుడిని ముట్టుకుని అభిషేకం చేయటం నా మనసుని శాంత పరిచింది..అదే దృశ్యం.. గంగా తీరంలో అమ్మ చేతులు జోడించి ఒక సారి అన్న పూర్ణమ్మ తల్లి..శివా.. శంకరా ఈ జన్మకు ఇది చాలు నాకు ఇంకేం అక్కర లేదు అని సంతోషం ఎక్కువై పూర్తిగా ఏడుస్తూ మొక్కుకోవటం ఎంతో ఇష్టంగా గంగ లో స్నానం చేయటం..నా ప్రయాణం సార్థకం అనుకున్నా..అన్నపూర్ణ మందిరం లో ఆమె ఎంతో అవేదన తో నా కూతురికి ఏ కష్టమూ రాకుండా చూడు..కనిపెట్టి ఉండు అని వేడుకుంటూ ఉంటే నా కు సంబంధం లేనట్లే ఉన్నాను.. అమె ఎప్పుడూ అంతే ..నాకు ఉద్యోగాలు ఊడి తే అవిడ శని దీపారాధన చేసేది..ఉపవాసాలు ఉండేది..వద్దో అన్నా వింటేనా ఆమెను వారణాసి కి తీసుకు పోవటం నా achivement.. అంతే..అదే.

నాకూ అంతులేని సంతృప్తి..నాకు కూడా ఉదయం ఆఫీస్ లో ఒక వారం లోపే సెలవు. మామూలు ట్రైన్ లో రిజర్వేషన్ కూడా మూడవ తరగతి కే..జనం తో కలిసి చేసిన రోజు కంటే ఎక్కువ ప్రయాణంలో నాకేం గుర్తులేవు. వినోద్ చెపుతున్న కాశీ వీధులు మిఠాయిలు..రుద్రాక్షలు గంగ నీళ్ల చెంబులు ఇవన్నీ నేనూ తిరిగి చూశాను. కానీ నేనేం మనసు నింపుకో లేదే అనిపించింది..అమ్మ నమ్ముకునే దేవుడి తో పరిచయం లేక పోవటం వల్ల నా..నాకే ప్రయాణాల గురించి డబ్బు లెక్క తప్ప ఇంకేమి ఆలోచన లేకపోవడం ...పుస్తకం చదువుతూ ఎందుకు నాకు ఈ ప్రయాణం లో అనుభూతి కలుగ లేదు అనుకున్నా..ముందే ప్లాన్ లేదు..ఎక్కడ ఏం చూడాలి అనుకో లేదు..పరమ శివుడు..గంగా తీరం.. అంతే..మా అమ్మ చాలా గుర్తు వచ్చింది వినోద్..నీలాగా ఇవన్నీ ముందే తెలుసుకుని ఉంటే అమ్మకు చూపించే దాన్ని కదా అని..

బావుంది బుక్ వినోద్..

తమాషాగా పూర్తి భక్తుడి మాదిరిగా కాకా మరీ జర్నలిస్ట్ లాగా తడి లేకుండా కాకుండా బాగా రాశావు.. జిలేబిలు..తియ్యని మిఠాయిలు నాకు బాగా గుర్తుకు వచ్చాయి..

మంచి బుక్..

వచ్చే సంవత్సరం. ఇంకో ప్రయాణం..ఇంకో బుక్..సరే కదా

– శుభాకాంక్షలు.

– Sujatha Chebrolu

bottom of page